మొటిమలు శాశ్వతంగా దూరం కావాలంటే, ఈ సూచనలను అనుసరించండి...! 1 y ago

featured-image

టీనేజ్‌లోకి వచ్చినప్పుడు చాలా మందికి మొటిమలు ఏర్పడతాయి. ఇవి వ్యక్తిగత శరీర లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా ఉంటాయి. కాలుష్యం, నిద్రలేమి, జీవనశైలి వంటి అనేక కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. దీనిని తగ్గించేందుకు చాలామంది బ్యూటీ పార్లర్స్‌కు వెళ్ళడం లేదా క్రీమ్స్ వాడడం వంటి మార్గాలను అనుసరిస్తారు. కొన్ని ఇంటి చిట్కాలు కూడా మొటిమలను త్వరగా తగ్గించగలవు. ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం.


ఐస్ ప్యాక్

ముఖంపై మొటిమలు ఉన్నప్పుడు ఐస్ వాటిని త్వరగా తగ్గిస్తుంది. ఓ బౌల్‌లో ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ వేసి, ముఖాన్ని 10 సెకన్ల పాటు, రెండు లేదా మూడుసార్లు అందులో ఉంచాలి. ఇది సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది లేదా, ఒక ఐస్ క్యూబ్‌ను మొటిమలపై పెట్టాలి. ఇబ్బందిగా అనిపిస్తే, ఐస్ క్యూబ్స్‌ను ఒక క్లాత్‌లో ఉంచి, దానితో మొటిమలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.


శనగపిండి ప్యాక్

ఒక బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని, అందులో కొంచెం పసుపు మరియు రెండు స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. అవసరమైతే రోజ్‌వాటర్ చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత, నీటితో కడిగి స్క్రబ్‌లా రాస్తూ కడిగేయాలి.


మొటిమల సమస్యకు సహజ చిట్కాలు మరియు నివారణ పద్ధతులు

 *మొటిమలు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని చిదిమి రాయాలి. ఇది మొటిమల సమస్యను తగ్గిస్తుంది.

*ఒక ఆపిల్ స్లైస్‌ను ముఖంపై రబ్ చేయాలి మరియు రెగ్యులర్‌గా చేస్తే జిడ్డు తగ్గుతుంది. జిడ్డు మొటిమలకు కారణం కావడంతో, ఇలా చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది, ముఖం కూడా తాజాగా ఉంటుంది.

*వేరుశనగ నూనె మరియు నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.

*ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్‌గా ముఖానికి వేయాలి. త‌ర్వాత‌ చల్లని నీటితో కడగాలి.


*బియ్యంపిండిలో కొంచెం పెరుగు కలిపి ప్యాక్ తయారు చేసి ముఖంపై వేయాలి. త‌ర్వాత‌ చల్లని నీటితో కడగాలి. ఇది ఫలితాన్ని ఇస్తుంది.

*తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి, పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. మరుసటి రోజు చల్లని నీటితో కడగాలి.

*టమాటా మొటిమల సమస్యను దూరం చేస్తుంది. టమాటను సగానికి కట్ చేసి, అందులో ఉప్పు చల్లి మొటిమలపై రుద్దాలి. టమాట గుజ్జును ఓ బౌల్‌లో తీసుకుని, అందులో తేనె కలిపి ముఖంపై రాసి ఆరాక కడగాలి. ఇది సమస్యను తగ్గిస్తుంది.

*కొంచెం వేప ఆకులను పేస్ట్ చేసి, అందులో చిటికెడు పసుపు మరియు నిమ్మరసం కలిపి మొటిమల ఉన్న చోట పెట్టాలి. ఆరిన తర్వాత కడగాలి.

*అరటిపండు గుజ్జుతో శెనగపిండి కలిపి ముఖంపై ప్యాక్‌గా వేయాలి. ఇది ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.



*చాలా సమస్యలకు మన లైఫ్‌స్టైల్ కారణమవుతుంది. ఇది ఆహారం, నిద్రలేమి, కాలుష్యం, సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ అవుతుంది.

*ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయిలీ ఫుడ్, వేపుళ్లు, చిరుతిళ్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి. వీటికి బదులు నీటిని ఎక్కువగా తాగి పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.

*నిద్రలేమిని దూరం చేసుకోవాలి, ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల మొటిమలు పెరుగుతాయి.

*కాలుష్యంలో ఎక్కువగా తిరగడం వల్ల సమస్య తీవ్రంగా మారుతుంది. అందువల్ల బయటకు వెళ్లినప్పుడు ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేయాలి. అలాగే, బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి.

*ఒత్తిడిగా ఫీలవ్వడం వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

*తలలో చుండ్రు అధికంగా ఉన్నప్పుడు కూడా మొటిమలు పెరుగుతాయి. అలాంటప్పుడు చుండ్రు సమస్యను ముందుగా తగ్గించుకోవాలి. ఇందుకోసం తలపై నిమ్మరసం అప్లై చేయాలి.

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD